: ఇన్ఫోసిస్ బోర్డు నుంచి వైదొలగిన మరో సభ్యుడు!


ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ బోర్డు నుంచి మరో సభ్యుడు వి.బాలకృష్ణన్ వైదొలిగారు. ఈ మేరకు ఈయన రాజీనామా చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఈ నెలాఖరు తర్వాత బాలకృష్ణన్ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. 1991లో ఇన్ఫోసిస్ లో చేరిన ఆయన బోర్డు సభ్యుడిగా కొనసాగుతూ ఇన్ఫోసిస్ బీపీఓకు హెడ్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ సీఈవోగా ఉన్న ఎస్.డి.షిబులాల్ 2015లో రిటైర్ అవుతున్నారు. ఆయన అనంతరం... బాలకృష్ణనే తదుపరి సీఈవో అవుతారని అందరూ భావించారు. కానీ, ఆయన రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News