: ఐపీఎల్ ప్రారంభోత్సవ బాధ్యత షారూక్ కంపెనీకి అప్పగింత
ఐపీఎల్ ఆరో సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ కు అప్పగించారు. షారూక్ ఖాన్ సహ యజమానిగా వ్యవహరిస్తున్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిరుడు ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. రెడ్ చిల్లీస్ తో ఒప్పందం తమకెంతో సంతోషదాయకమని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు.
ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంలో రెడ్ చిల్లీస్ కు ఉన్న అనుభవం దృష్టిలో ఉంచుకునే ఆ సంస్థకు ఓపెనింగ్ సెర్మనీ బాధ్యతలు అప్పగించామని శుక్లా వెల్లడించారు. కాగా, ఐపీఎల్ తాజా సీజన్ ఏప్రిల్ 2న కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఆరంభం కానుంది.