: 'బిగ్ బాస్' పై కేసు నమోదు చేశాం: అనురాగ్ శర్మ


కలర్స్ టీవీ చానల్ లో ప్రసారమవుతున్న రియాలిటీ షో 'బిగ్ బాస్' నిర్వాహకులపై కేసు నమోదు చేశామని హైదరాబాదు పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. కేసుపై న్యాయనిపుణుల సలహాలు తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. కాగా గత శనివారం ప్రసారమైన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే సల్మాన్ ఖాన్ కూడా ఇస్లాం మతానికి చెందిన వ్యక్తే కావడం విశేషం.

  • Loading...

More Telugu News