: విమానాశ్రయంలో మనీలా మేయర్ కుటుంబం కాల్చివేత
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా విమానాశ్రయంలో ఆ నగర మేయర్ కుటుంబాన్ని ఆగంతుకులు కాల్చి దర్జాగా పారిపోయారు. ఫిలిప్పీన్స్ లోని వేరే ప్రదేశానికి కుటుంబ సమేతంగా వెళ్లి, తిరిగి వచ్చి విమానాశ్రయంలో వాహనం కోసం ఎదురు చూస్తున్న మేయర్ కుటుంబాన్ని... మోటారు సైకిళ్లపై వచ్చిన దుండగులు విచక్షణా రహితంగా కాల్చి వెళ్లిపోయారు. ఈ ఘటనలో మేయర్, అతని భార్య, ఇద్దరు సహచరులు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు.