: దక్షిణాఫ్రికాపై పైచేయి సాధించిన ఇండియా


సౌత్ ఆఫ్రికాతో జొహానెస్ బర్గ్ లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో... సఫారీలు 244 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీంతో కీలకమైన 36 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని భారత్ సాధించింది. ఈ రోజు ఉదయం 6 వికెట్ల నష్టానికి 213 పరుగులతో ఆటను ప్రారంభించిన సఫారీలు... జహీర్ ఖాన్ ధాటికి నిలువలేకపోయారు. ఈ రోజు ఆటలో ఫిలాండర్ అర్ధ సెంచరీ (59) చేశాడు. మన బౌలర్లతో జహీర్ 4, ఇషాంత్ 4, షమీ 2 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా లైనప్ ను కుప్పకూల్చారు. భారత్ సఫారీ గడ్డమీద అడుగుపెట్టిన తర్వాత తొలిసారి వారిపై ఆధిపత్యం చెలాయించింది.

  • Loading...

More Telugu News