: సీమాంధ్ర కోసం బీజేపీ ధర్నా
రాష్ట్ర విభజన ప్రక్రియలో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ విజయవాడలో బీజేపీ ధర్నాకు దిగింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే సీమాంధ్ర ప్రయోజనాలను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కిందని ఈ సందర్భంగా బీజేపీ ఆరోపించింది. సీమాంధ్రుల పట్ల పూర్తి వివక్షతో, అన్యాయంగా తెలంగాణ ముసాయిదా బిల్లును రూపొందించారని వారు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలో ఆరోపించారు.