: కాంగ్రెస్ తో కుమ్మక్కైన జగన్ బీజేపీ వైపు కూడా చూస్తున్నారు: పయ్యావుల


కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే కుమ్మక్కైన జగన్ నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓడిపోవడంతో ఇప్పుడు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ దుయ్యబట్టారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది చీర్ గర్ల్స్ పాత్ర అని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ను సోనియా ఇంటి ముందు ధర్నాకు రమ్మంటే రాలేదని.. పార్లమెంటులో కూడా ఉద్యమం చేయరని.. రాష్ట్రంలో మాత్రం తామే ఉద్యమం చేస్తున్నట్టు నాటకాలు మాత్రం ఆడతారని పయ్యావుల ఎద్దేవా చేశారు.

ఇద్దరు ముగ్గురున్న టీడీపీ ఎంపీలు పార్లమెంటును స్థంభింపజేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ ఏనాడూ పోడియం వైపు చూడలేదని అన్నారు. రాజ్యాంగ సవరణ చేయాలని, వివిధ పార్టీల నేతలను సమైక్యం వైపు తీసుకొచ్చేందుకు కలుస్తున్నానని చెప్పుకునే జగన్... సోనియా గాంధీని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. బీజేపీకి టీడీపీ దగ్గరవుతుండటం జీర్ణించుకోలేని జగన్ బీజేపీ వైపు ఆశగా చూస్తున్నాడని అన్నారు.

  • Loading...

More Telugu News