: పడిపోతున్న బంగారం ధర


బంగారం ధర మళ్లీ క్షీణించడం మొదలైంది. మార్కెట్ ఉద్దీపన చర్యల్లో భాగంగా జనవరి నుంచి నెల నెలా 10 బిలియన్ డాలర్ల(రూ. 62వేల కోట్లు) బాండ్ల కొనుగోలును తగ్గిస్తున్నట్లు అమెరికన్ సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడంతో బంగారంపై ప్రభావం పడింది. ఈ నిర్ణయం వల్ల ఆర్థిక సంస్థలకు నిధుల లభ్యత కొంత తగ్గిపోతుంది. దీంతో అవి బంగారం, ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులను కొంత మేర ఉపసంహరించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సింగపూర్ మార్కెట్లో ఔన్స్ బంగారం(31 గ్రాములు) ధర 1,185 డాలర్లకు దిగొచ్చింది. ఇది ఆరు నెలల కనిష్ఠ స్థాయి. మరికొంత తగ్గితే మూడేళ్ల కనిష్ఠ స్థాయిని కూడా తాకుతుంది. సాంకేతికంగా చూస్తే ఔన్స్ బంగారం 1,180 డాలర్లు దిగితే మరింత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో ఫిబ్రవరి కాంట్రాక్టు 10 గ్రాములు రూ. 28,356 పలుకుతోంది. మరింత తగ్గితే కొనుగోలు చేయవచ్చన్న భావనతో రిటైల్ మార్కెట్లో బంగారం కొనుగోళ్లు మందగించాయి.

  • Loading...

More Telugu News