: సింగపూర్ నుంచి 52 మంది భారతీయులు బలవంతంగా వెనక్కి


52 మంది భారతీయులను సింగపూర్ ప్రభుత్వం బలవంతంగా వెనక్కి పంపించేస్తోంది. ఇటీవల అక్కడ జరిగిన ఘర్షణల్లో వీరి పాత్ర ఉందని తేలడంతో ఈ చర్య తీసుకుంది. ఈ నెల 8న భారత్ కు చెందిన ఒక వ్యక్తి పైనుంచి అక్కడి లిటిల్ ఇండియా ప్రాంతంలో ఒక కారు దూసుకుపోవడంతో అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. దీంతో ఆగ్రహించిన స్థానిక భారతీయులు అల్లర్లకు పాల్పడిన విషయం తెలిసిందే. 40 ఏళ్లలో అక్కడ జరిగిన అతిపెద్ద అల్లర్లు ఇవే. వీటిలో పాత్ర ఉందనే కారణంతో 52 మందిని సింగపూర్ సర్కారు ఈ రోజు భారత్ కు పంపించేస్తోంది. 28 మంది భారతీయులపై కేసులు నమోదు చేశారు. వాటిపై సోమవారం నుంచి విచారణ ప్రారంభమవుతుంది. అల్లర్ల సమయంలో ఘటనా స్థలంలో ఉన్న 200 మంది ఆసియన్లు చట్టాలకు లోబడి ఉండాలని వారికి నోటీసులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News