: సల్మాన్ ఖాన్ పై హైదరాబాదులో కేసు నమోదు


నటుడు సల్మాన్ ఖాన్ పై హైదరాబాదులోని ఫలక్ నుమా పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. కలర్స్ చానల్ లో ప్రసారమవుతున్న 'బిగ్ బాస్' రియాల్టీ షోలో ముస్లింల మనోభావాలను కించపరిచేలా సల్మాన్ వ్యాఖ్యలు చేశారంటూ మహ్మద్ ఫసీ హుద్దీన్ అనే వ్యాపారవేత్త నగరంలోని ఆరో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు. పరిశీలించిన మేజిస్ట్రేట్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించడంతో.. షో దర్శకుడు రజత్ రవాలీపై కూడా కేసు నమోదు అయింది.

  • Loading...

More Telugu News