: మంత్రి శ్రీధర్ బాబు నుంచి తనకు, తన భర్తకు ప్రాణహాని ఉంది


తనకు, తన భర్తకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి శ్రీధర్ బాబు నుంచి ప్రాణ హాని ఉందని ఓ మహిళ నిన్న హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను పోలీసులు నిర్బంధించి, చిత్ర హింసలకు గురిచేశారని... దీని వెనుక శ్రీధర్ బాబు హస్తం ఉందని పిటిషన్ లో తెలిపింది. కుట్ర పూరితంగా వ్యవహరించిన పోలీసులతో పాటు, మంత్రిపై కూడా కేసు నమోదుకు ఆదేశించాలని కోర్టును కోరింది.

వివరాల్లోకి వెళ్తే, వి.స్వరూప భర్త గడ్డం శ్రీరామ్ 'తెలంగాణ జనరల్ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ' అధ్యక్షుడుగా ఉన్నారు. శ్రీధర్ బాబు, ఆయన అనుచరుల అక్రమాలపై శ్రీరామ్ కరపత్రాలను ముద్రించారన్న కారణంతో తన భర్తను గోదావరిఖని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని స్వరూప వాపోయింది. అండర్ ట్రయల్ నిందితుడిగా ఉన్న తన భర్తను మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ వైద్యశాలకు తరలించేలా, కరీంనగర్ జిల్లా జైలు సూపరింటెండెంట్ ను ఆదేశించాలని పిటిషన్ లో కోరింది. అలాగే, మంత్రి నుంచి తమకు ప్రాణహాని ఉన్నందున తమకు రక్షణ కల్పించేలా హైదరాబాద్ కమిషనర్ ను ఆదేశించాలని విన్నవించింది. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరింది. ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు నేడు చేపట్టనుంది.

  • Loading...

More Telugu News