: మాయా ముసుగు!


పాతాళ భైరవి సినిమాలో ఒక సన్నివేశంలో ఒక దుప్పటి కప్పుకోగానే హీరో కనిపించడు... అలా ఎదుటి వారికి కనిపించకుండా చేసేలా ఒక తొడుగును పరిశోధకులు తయారుచేశారు. ఈ తొడుగు ఎంతగా పనిచేస్తుందంటే... కనీసం సెన్సర్లకు కూడా దొరక్కుండా చేస్తుందట.

టెక్సాస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వస్తువులను కంటికి కనిపించకుండా చేసే అదృశ్య తొడుగులను తయారుచేశారు. ఈ తొడుగులను వేస్తే వస్తువులు మన కళ్లకు కనిపించవట, కనీసం సెన్సర్లకు కూడా అందకుండా చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. బ్యాటరీతో పనిచేసే ఈ పరికరానికి బోలెడన్ని ప్రత్యేకతలున్నాయట. వస్తువులపై పడే కాంతిని చెల్లాచెదురు చేయడం ద్వారా సదరు వస్తువులు కంటికి కనిపించకుండా ఇది చేస్తుందట. అత్యంత సామర్ధ్యంతో కూడిన సెన్సర్లు సైతం గుర్తుపట్టలేనంతగా ఇది వాటి సంకేతాలను అడ్డుకుంటుందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న ఆండ్రియా చెబుతున్నారు.

  • Loading...

More Telugu News