: బ్రదర్ అనిల్ బినామీలను అరెస్టు చేయండి: తెలంగాణ క్రైస్తవ సంఘాల డిమాండ్
మతం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న బ్రదర్ అనిల్ బినామీలను వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ క్రైస్తవ సంఘాల సమాఖ్య నేడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నిరుపేద క్రైస్తవులను కాపాడాలంటే, తక్షణమే బ్రదర్ అనిల్ బినామీ పాస్టర్ శ్యామ్ కుమార్ ను అరెస్టు చేసి అతని బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని సమాఖ్య కోరింది.
క్రైస్తవ మతాన్ని వ్యాపారంగా మార్చిన ఘనత బ్రదర్ అనిల్, పాస్టర్ శ్యామ్ లదే అని సమాఖ్య ఎత్తిపొడిచింది. వచ్చే ఎన్నికల్లో మతాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీకి లాభం చేకూర్చే దిశగా కుట్ర జరుగుతోందని తెలంగాణ క్రైస్తవ సంఘాల సమాఖ్య ఆరోపించింది.