: మహేష్ అభిమానులు అయినందుకు గర్వపడాలి: బోయపాటి శ్రీను
మహేష్ బాబు అభిమానులు అయినందుకు ఆయన అభిమానులంతా గర్వపడాలని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ఆయన అభిమానులు ఎక్కడెక్కడ్నుంచో హైదరాబాద్ రావడం, ఇక్కడ నానా ఇక్కట్లు పడి ఆడియో ఫంక్షన్ కి వచ్చి, ఎప్పటికో ఇంటికి చేరడం ఆయనకు నచ్చలేదని, అందుకే ఆయన ఈ సరికొత్త ఆడియో వేడుకను జరిపించారని ఆయన అన్నారు. అందుకే ఆయన అభిమానులు కావడం నిజంగా అదృష్టమేనని బోయపాటి శ్రీను అన్నారు.