: చెన్నై రైనోస్ బ్రాండ్ అంబాసిడర్ గా త్రిష
అందాల నటి త్రిష సీసీఎల్ (సెలెబ్రిటీ క్రికెట్ లీగ్) చెన్నై రైనోస్ ఫ్రాంచైజీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. రానున్న నాలుగో ఎడిషన్ సీసీఎల్ టోర్నమెంటుకు బ్రాండ్ అంబాసిడర్ గా త్రిషను ఎంపిక చేశామని... ఆమె చెన్నైకు చెందినది కావడంతో, ఆమె రాక తమ జట్టుకు మరింత ఇమేజ్ ను తెచ్చిపెడుతుందని చెన్నై రైనోస్ యాజమాన్యం తెలిపింది. ఇప్పటి దాకా జరిగిన సీసీఎల్ మూడు ఎడిషన్లలో మొదటి రెండు సార్లు చెన్నై రైనోస్ గెలుపొందగా, మూడోసారి కర్ణాటక బుల్ డోజర్స్ విజయం సాధించింది.