: 280 పరుగులకు భారత్ ఆలౌట్


దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 280 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ రోజు ఉదయం 5 వికెట్ల నష్టానికి 255 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా పూర్తిగా తడబడింది. నిప్పులు చెరిగిన సఫారీ పేసర్ల ధాటికి మన వాళ్లు బ్యాట్లు ఎత్తేశారు. ఈ రోజు ధోనీ, రెహానే సహా ఏ ఒక్క బ్యాట్స్ మెన్ కూడా రాణించలేకపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్ 4 వికెట్లు, మోర్కెల్ 3 వికెట్లు, కలిస్, స్టెయిన్ చెరో వికెట్ తీసుకున్నారు. భారత బ్యాట్స్ మెన్ లో కోహ్లీ 119 పరుగులు చేయగా, రహానే 47 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు.

  • Loading...

More Telugu News