: బీఏసీ సమావేశంలో సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారు?: శోభానాగిరెడ్డి


బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు వ్యతిరేకిద్దామన్న ముఖ్యమంత్రి... బీఏసీ సమావేశంలో ఎందుకు మౌనంగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. విభజన విషయంలో బీహార్, యూపీ సాంప్రదాయాలను పాటించాలని సూచిస్తున్న సీఎం... ఇక్కడ వాటిని ఎందుకు అమలుచేయడం లేదని నిలదీశారు. అక్కడ విభజన తీర్మానంపై చర్చ జరిగిన తర్వాతే, బిల్లుపెట్టారని చెప్పారు. ఇక్కడ కూడా అదే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కిరణ్ సమైక్య ముసుగు వేసుకుని సోనియాగాంధీ ఆదేశాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News