: అద్వానీకి ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పిన నీతి కథ ఏంటి?


బీజేపీని విడిచి పెట్టవద్దని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అగ్రనేత అద్వానీని కోరారు. అద్వానీ ఇంగ్లిష్ రచన 'మై టేక్', హిందీ రచనలు 'రాష్ట్ర సర్వోపారి', 'ద్రిష్టికోణ్' పుస్తకావిష్కరణ న్యూఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ భగవత్ అద్వానీని బీజేపీలోనే ఉండాలని, మార్గదర్శనం చేయాలని కోరారు. పార్టీని వీడితే బీజేపీకి కలిగే నష్టాన్ని ఆయన ఒక నీతి కథ రూపంలో వివరించారు.

ఒక గ్రామంలో వృద్ధ దంపతులు ఉన్నారు. ఒకరోజు ఆ ముసలావిడ గ్రామంలో ఒక పూజా కార్యక్రమం జరుగుతుండగా అగ్ని గుండంలో ఉమ్ము వేసింది. దాంతో అగ్ని బంగారు వర్ణంలోకి మారిపోయింది. దీన్ని గమనించిన ఆ ముసలావిడ భర్త విషయం ఎవరికీ చెప్పవద్దని సూచించాడు. అయినా ఆవిడ గ్రామంలో తెలిసిన వారందరికీ విషయం చెప్పింది. ఆ తర్వాత గ్రామంలో ఈ వృద్ధ దంపతులు తప్ప మిగతా వారంతా ధనవంతులుగా మారిపోయారు. దీంతో గ్రామస్థులు ఆ దంపతులను చూసి హేళన చేయడంతో వారు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ గ్రామం మొత్తం అగ్నిప్రమాదానికి ఆహుతైపోయింది.. అంటూ మోహన్ భగవత్ అద్వానీకి చెప్పారు. అద్వానీ దూరమైతే బీజేపీకి కూడా ఆ గ్రామంలాంటి పరిస్థితే ఎదురవుతుందని భగవత్ అన్నారు.

  • Loading...

More Telugu News