: జనవరి 3వ తేదీ వరకు శాసనసభ వాయిదా


రాష్ట్ర శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. 2014 జనవరి 3వ తేదీన సమావేశాలు పునఃప్రారంభమవుతాయని సభాపతి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దీంతో, ఇవాళ్టితో ఈ యేటి శీతాకాల శాసనసభ సమావేశాలు ముగిసినట్టయింది. 2014 జనవరి 3 నుంచి 10వ తేదీ వరకు శాసనసభ తొలి విడత సమావేశాలు జరుగుతాయని స్పీకర్ ప్రకటించారు. తదుపరి రెండో విడత సమావేశాలు జనవరి 16 నుంచి 23వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించారు. రానున్న సమావేశాల్లో సెలవులను మినహాయిస్తే కేవలం 13 రోజులపాటే సభ జరగనుంది.

  • Loading...

More Telugu News