: సీఎం సర్కస్ లో పులే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తోంది: నరేంద్ర


తుపానును ఆపలేకపోయాను కానీ విభజనను ఆపుతానని శపథం చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కస్ లో పులిలా మారారని టీడీపీనేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా చెబితే అలా ఆడుతూ సీఎం విభజనకు సహకరిస్తున్నారని విమర్శించారు. విభజన బిల్లును గట్టెక్కించేందుకు సీమాంధ్రకు చెందిన వంద మంది ఎమ్మెల్యేలను కొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కన్నతల్లికి, జన్మభూమికి ద్రోహం చేసేవారిని తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సభలో రాష్ట్ర విభజన రహస్య ఎజెండాగా చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News