: జలయజ్ఞం ప్రాజెక్టుల అంచనాల పెంపును మేం ఒప్పుకోం: రాజనర్సింహ
జలయజ్ఞం ప్రాజెక్టుల అంచనాల పెంపును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని డిప్యుటీ సీఎం దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల అంచనాల పెంపు ఎవరికి లాభం చేకూర్చేందుకని ప్రశ్నించారు. అంచనాల పెంపువల్ల తెలంగాణ ప్రజలపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేబినెట్ లో చర్చించకుండా పెంపుపై నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆయన నిలదీశారు. దీనిపై ఇప్పటికే చీఫ్ సెక్రటరీకి లేఖ రాశానని, మరోసారి లేఖ రాస్తానని ఆయన తెలిపారు. ఈ విషయంలో త్వరలోనే గవర్నర్ ను కలుస్తానని రాజనర్సింహ స్పష్టం చేశారు. జలయజ్ఞం పరిధిలో రాయలసీమలో పలు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా, పోలవరం ప్రాజెక్టు కూడా జలయజ్ఞం కిందికే వస్తుంది.