: వచ్చేస్తోంది బీజేపీ అభ్యర్థుల జాబితా
నాలుగు రాష్ట్రాల్లో మంచి ఫలితాలను సొంతం చేసుకున్న భారతీయ జనతా పార్టీ 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే విధమైన ఫలితాలతో కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవాలనే ఉత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను జనవరిలో విడుదల చేయడానికి సన్నద్ధమైంది. పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు జనవరి ద్వితీయార్ధాన్ని డెడ్ లైన్ గా నిర్ణయించామని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీలో చెప్పారు. అభ్యర్థులు ముందుగా తమ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా జాబితాను విడుదల చేయాలని రాజ్ నాథ్ భావిస్తున్నారు. అభ్యర్థుల పేర్లకు సంబంధించి ప్రతిపాదనలను తొందరగా పంపించాలని పార్టీ రాష్ట్ర శాఖల అధిపతులతో సోమవారం నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో కోరనున్నారు.