: నేడు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి.. పోలీసుల్లో హై టెన్షన్


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు ఆయన నగరంలోనే బస చేస్తారు. ఇక్కడ నుంచే ఆయన తన విధులను నిర్వర్తిస్తారు. అంతేకాకుండా, ఏవైనా ఇతర రాష్ట్రాల పర్యటనలు ఉన్నా, వాటిని ముగించుకుని తిరిగి హైదరాబాదుకే చేరుకుంటారు. ప్రతియేటా శీతాకాలంలో హైదరాబాద్ బొల్లారంలో భారత రాష్ట్రపతి రెండు వారాల పాటు బసచేయడం ఆనవాయతీగా వస్తోంది.

అయితే, రాష్ట్రపతి పర్యటన నగర పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. పునర్విభజన బిల్లు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో, సమైక్యవాదులు నిరసన చర్యలు చేపట్టే అవకాశం ఉండటంతో, పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే భద్రతా ఏర్పాట్లపై రిహార్సల్స్ కూడా చేశారు. రాష్ట్రపతి భద్రత కోసం 30 ప్లటూన్ల బలగాలను వినియోగిస్తున్నట్టు హైదరాబాద్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.

  • Loading...

More Telugu News