: ఈ జబ్బు పెద్ద నగరాల్లో ఎక్కువట


పెద్ద నగరాల్లో నివసించే వారిలోనే ఒక జబ్బు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. మెట్రో నగరాల్లో నివసించే వారిలో ఎక్కువమందికి హైపోథైరాయిడిజం ఉన్నట్టు ఒక అధ్యయనంలో తేలింది. ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ అబోట్‌ ఆధ్వర్యంలో 2012లో ఢిల్లీ, హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, గోవా, ముంబై, అహ్మదాబాద్‌ నగరాల్లో వైద్యుల బృందం చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ వ్యాధి తీవ్రత ముందుగా బెంగళూరు, చెన్నైల్లోను తర్వాత స్థానంలో హైదరాబాద్‌ ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది.

పెద్ద పెద్ద నగరాల్లో నివసించే వారిలో హైపోథైరాయిడిజం ఎక్కువగా ఉంది. మరో ముఖ్యవిషయమేమంటే వీరిలో సగంమందికి తమకు అసలు థైరాయిడ్‌ వ్యాధి ఉన్నట్టు కూడా తెలియదట. మెట్రో నగరాల్లో నివసించేవారిలో 19.95శాతం మందికి థైరాయిడ్‌ ఉండగా 7.31 శాతం మందికి ఈ వ్యాధి తొలిదశ లక్షణాలు కనిపిస్తున్నాయట. ఈ విషయాలను గురించి ఈ సర్వేలో పాల్గొన్న ఉస్మానియా ఆసుపత్రి ఎండోక్రైనాలజిస్ట్‌ డాక్టర్‌ రాకేష్‌ కుమార్‌ సహాయ్‌, సికింద్రాబాద్‌ టచ్‌ ఆసుపత్రి వైద్యుడు లాయ్‌ కేమన్స్‌ మాట్లాడుతూ, హైపోథైరాయిడిజం ముప్పు మగవారితో పోల్చితే మహిళల్లోనే దాదాపుగా మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తేలిందని తెలిపారు. టి3, టి4, టీఎస్‌హెచ్‌ హార్మోన్‌ పరీక్షల ద్వారా థైరాయిడ్‌ ఉందో లేదో సులభంగా గుర్తించవచ్చని వీరు తెలిపారు.

  • Loading...

More Telugu News