: సీకే నాయుడు అవార్డుకు ఎంపికైన క్రికెటర్ కపిల్ దేవ్
సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారానికి భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఎంపికయ్యారు. ఈయన పేరును బీసీసీఐ అవార్డుల కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అవార్డు కమిటీ సభ్యులు ఇవాళ చెన్నైలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. గతేడాది ఈ పురస్కారాన్ని సునీల్ గవాస్కర్ అందుకున్నారు.
భారత క్రికెట్ లో కపిల్ ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. టెస్టుల్లో ఐదు వేలకు పైగా పరుగులు పూర్తి చేసిన ఆయన.. 434 వికెట్లు పడగొట్టి రికార్డు పుటలకెక్కాడు. 1978లో భారత్ క్రికెట్ ఆటలోకి ప్రవేశించిన కపిల్ 1994 వరకు కొనసాగాడు. వన్డే క్రికెట్ లో 225 అంతర్జాతీయ ఆటల్లో ప్రతిభను కనబరిచాడు. భారత క్రికెట్ జట్టు సారధిగా వ్యవహరించిన కపిల్ 1983లో భారతదేశానికి ప్రపంచ కప్ అందించాడు.