: అన్నాహజారే పోరాటం అమూల్యమైనది: చంద్రబాబు
లోక్ పాల్ బిల్లుపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సాగించిన సుదీర్ఘ పోరాటం అమూల్యమైనదని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. లోక్ పాల్ బిల్లుకు పార్లమెంటు సభ్యుల మద్దతు లభించడం శుభ పరిణామమని ఆయన అన్నారు. బిల్లు బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.