: గూగుల్ లో అత్యధికులు వెతుకులాడిన తార?


ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికులు వెతుకులాడింది ఏ తార కోసమో తెలుసా? కెనడాలో బూతు సినిమాలు చేసి భారత్ లో సినీతారగా సందడి చేస్తున్న సన్నీలియోన్ కోసం! కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, కరీనా కపూర్ వంటి వారిని సైతం తోసి రాజని సన్నీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. టాప్ టెన్ లో అగ్రస్థానంలోనూ, చిట్టచివరి స్థానంలోనూ సెక్సీమణులే ఉండడం విశేషం. ఈ లిస్టులో తొలి స్థానాన్ని సన్నీ లియోన్ దక్కించుకోగా... తరువాత సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, షారూఖ్ ఖాన్, హనీ సింగ్, కాజల్ అగర్వాల్, కరీనా కపూర్, సచిన్ టెండూల్కర్, పూనమ్ పాండేలు ఉన్నారు.

  • Loading...

More Telugu News