: 2016 నాటికి ప్లాస్టిక్ కరెన్సీ తీసుకొస్తాం: బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్
ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో ఇప్పటికే ప్లాస్టిక్ కరెన్సీ చలామణిలో ఉంది. ఇప్పుడు ఇంగ్లండ్ కూడా అదే బాటలో పయనిస్తోంది. 2016 సంవత్సరం నాటికి ప్లాస్టిక్ కరెన్సీని అందుబాటులోకి తీసుకొస్తామని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ప్రకటించింది. పాలిమర్ తో తయారైన ప్లాస్టిక్ కరెన్సీ ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనీ.. దుస్తులతో పాటు పొరపాటున వాషింగ్ మెషీన్ లో పడేసినా పాలిమర్ నోట్లు పాడవకుండా ఉంటాయని బ్యాంక్ చెబుతోంది. ప్లాస్టిక్ నోట్ల వాడకానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేశామని.. అందులో అత్యధిక ప్రజలు ఈ తరహా పాలిమర్ నోట్ల వాడకానికే మొగ్గు చూపారని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వెల్లడించింది.