: వాళ్లను కూడా గుడ్డలూడదీసి నగ్నంగా నిలబెట్టండి: ములాయం సింగ్


అమెరికాలో భారత దౌత్య అధికారిణి దేవయాని పట్ల అమెరికా పోలీసులు ప్రవర్తించిన తీరుపై పార్లమెంటు ఉభయసభల్లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. పెద్దన్నయ్యగా చెలామణి అయ్యే అమెరికా ప్రవర్తనను అన్ని పార్టీలు తప్పుబట్టాయి. అమెరికాకు బుద్ధి చెప్పాల్సిందే అంటూ పలువురు సీనియర్ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ అమెరికాపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. దేవయానిని అవమానపరచిన విధంగానే ఇక్కడ ఎంబసీల్లో పనిచేస్తున్న అమెరికన్లను కూడా గుడ్డలూడదీసి నగ్నంగా నిలబెట్టాలని డిమాండ్ చేశారు. అమెరికా క్షమాపణలు చెప్పేదాకా భారత్ శాంతించరాదని తెలిపారు.

  • Loading...

More Telugu News