: భారత జాలర్లను విడుదల చేసిన లంక


తమిళ జాలర్ల అరెస్టుపై భారత్ నుంచి ఒత్తిళ్లు అధికమవుతున్న నేపథ్యంలో శ్రీలంక సర్కారు నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. తమ నావికా దళం అదుపులో ఉన్న 16 మంది తమిళ జాలర్లను సోమవారం విడుదల చేసింది.

కొద్దిరోజుల క్రితం లంక తీరానికి సమీపంలో చేపలు పడుతున్న మత్స్యకారులపై లంక నేవీ కాల్పులు జరిపి, వారిని అరెస్ట్ చేసింది. ఈ సంఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. ప్రధాని మన్మోహన్ కు లేఖ రాశారు. వెంటనే స్పందించిన ప్రధాని భారత విదేశీ వ్యవహారాల శాఖను రంగంలోకి దించారు.

దీంతో.. భారత, లంక అధికారుల మధ్య చర్చలు చోటు చేసుకున్నాయి. చర్చలు సఫలం కావడంతో లంక అధికారులు భారత జాలర్లను కోర్టులో హాజరుపరిచారు. మరెప్పుడూ సరిహద్దులు దాటి లంక జలాల్లో చేపలు పట్టవద్దని హెచ్చరించి వదిలేశారు. అనంతరం వారిని భారత దౌత్యాధికారులకు అప్పగించారు. 

  • Loading...

More Telugu News