: ముసాయిదా బిల్లు నిర్లక్ష్యంగా ఉంది: నాదెండ్ల భాస్కరరావు
తెలంగాణ ముసాయిదా బిల్లును నిర్లక్ష్యంగా తయారు చేశారని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముసాయిదా బిల్లులో పలుమార్లు తెలంగాణ పదానికి బదులు తమిళనాడు పదం వాడడాన్ని బట్టి చూస్తుంటే దాని తయారీ విధానం అర్థమవుతుందని అన్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లు తయారీ పద్ధతి ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేస్తున్నామన్న భావం బిల్లులో ఏ కోశానా కన్పించడం లేదని ఆయన మండిపడ్డారు. స్పీకర్ గా నాదెండ్ల మనోహర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రవిభజన జరగదనే తాను విశ్వసిస్తున్నానని అన్నారు.