: ఆస్కార్ బరిలో షెర్లిన్ చోప్రా నటించిన 'కామసూత్ర 3డీ'
శృంగారతార షెర్లిన్ చోప్రా ప్రధాన పాత్రధారిణిగా రూపొంది, అమెరికాలో విడుదలైన బహుభాషా చిత్రం 'కామసూత్ర 3డీ' ప్రతిష్ఠాత్మక ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ సినిమాలోని ఐదు పాటలు బెస్ట్ ఒరిజినల్ విభాగంలో పోటీకి నిలిచాయని దర్శకుడు రూపేష్ పాల్ చెప్పారు. సచిన్, శ్రీజీత్ లు రూపొందించిన ఈ పాటలను ఓట్ల ఆధారంగా అకాడెమీ సభ్యులు ఎంపిక చేశారు. ఈ అవార్డు కోసం 75 పాటలు పోటీలో నిలవగా ఈ సినిమాలోని రెండు పాటలు టాప్ 5 లో నిలిచాయి. ఈసారి ఆస్కార్ బరిలో మొత్తం 289 సినిమాలు బరిలో నిలిచాయి. విజేతను జనవరి 16న ప్రకటించనున్నారు. కాగా మార్చి 2న అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది.