: షమీ అత్యుత్తమ బౌలర్: గంగూలీ
దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత జట్టు సభ్యుడు మహ్మద్ షమీ అత్యుత్తమ బౌలర్ అని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసించారు. సౌతాఫ్రికాలో పర్యటిస్తుండగా జహీర్ ఖాన్, శ్రీశాంత్ అత్యుత్తమ ఫాంలో ఉండగా చూశానని, కానీ లైన్ అండ్ లెంగ్త్ పాటించడంలో షమీ నిలకడ చూపిస్తున్నాడని అన్నారు. ప్రస్తుత బౌలర్లలో షమీ మెరుగ్గా రాణిస్తుండడం ఆనందం కలిగిస్తోందని బ్యాట్స్ మన్ మరింత నిలకడ చూపించాలని ఆయన అభిప్రాయపడ్డారు. వన్డేలలో టీమిండియా దారుణంగా విఫలమైందని గంగూలీ అన్నారు.