: 'అమ్మాయిలే నయం' టీమిండియా సహచరులపై ధోనీ ఛలోక్తులు


టీమిండియా సహచరులపై కెప్టెన్ ధోనీ ఛలోక్తులు విసిరాడు. టీమిండియాకు సౌతాఫ్రికాలో భారత్ హైకమిషనర్ వీరేంద్ర గుప్తా ఏర్పాటు చేసిన విందు సందర్భంగా ధోనీ మాట్లాడుతూ, పార్టీకి రెడీ అవ్వాలంటే అమ్మాయిలే ఎక్కువ సమయం తీసుకుంటారని అందరూ అనుకుంటారని.. కానీ అది వాస్తవం కాదని.. తమ టీంలో కొందరు బాయ్స్ అమ్మాయిల కంటే ఎక్కువ సమయం తీసుకుంటారని అన్నాడు. కొందరు హెయిర్ జెల్ లేకుండా బయటికే రారని, మరి కొందరు సన్ స్క్రీన్ లోషన్, షవర్ జెల్ లేకుండా బయటకు అడుగుపెట్టరని అన్నాడు. విందు సందర్భంగా సర్వర్ తో నవ్వుతూ తాము భారతీయులమైనా తక్కువ తినే రకం కాదని, కొందరికి మూడు, నాలుగుసార్లు వడ్డించాల్సిందేనని సహచరుల మొహమాటాన్ని తీసి పారేశాడు. మ్యాచ్ కు ముందు భారత జట్టు అభిమానులతో ఉల్లాసంగా గడిపింది.

  • Loading...

More Telugu News