: దేశానికి బలమైన లోక్ పాల్ అవసరం: రాహుల్ గాంధీ
దేశంలో అవినీతిని అంతం చేయడానికి బలమైన లోక్ పాల్ బిల్లు అవసరమని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ గతంలో అవినీతి అంతానికి ఆరు బిల్లులను ఆమోదించామని, అయినప్పటికీ అవినీతి అంతం కాలేదని, ఈ బిల్లుతోనే అవినీతి ఆగిపోదని.. ఇంతకంటే పటిష్ఠమైన వ్యవస్థ అవసరమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అలాగే లోక్ పాల్ బిల్లును ఆమోదించి చరిత్ర సృష్టించబోతున్నామన్నారు.