: లోక్ సభ గంట సేపు, రాజ్యసభ పావు గంట పాటు వాయిదా
పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్ సభ మధ్యాహ్యం 12 గంటల వరకు వాయిదా పడగా, రాజ్యసభ పావుగంట పాటు వాయిదా పడింది. లోక్ సభలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు స్పీకర్ పోడియంను ముట్టడించి రసాభాస చేశారు. టీడీపీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి స్పీకర్ కు అడ్డంగా ప్లకార్డును పెట్టారు. దీంతో సభ ఆర్డర్ లో లేదంటూ స్పీకర్ మీరాకుమార్ సభను గంటపాటు వాయిదా వేశారు.