: దక్కన్ క్రానికల్ పిటీషన్ ను తిరస్కరించిన ‘సుప్రీం’
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్ కు దేశ అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆ పత్రిక యాజమాన్యం దాఖలు చేసిన పిటీషన్ ను ‘సుప్రీం’ తిరస్కరించింది. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ క్రానికల్ వేసిన పిటీషన్ ను ఇవాళ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ స్థలాన్ని ఖాళీ చేయాలని దక్కన్ క్రానికల్ యాజమాన్యాన్ని ఇంతకు ముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.