: భారత్, జపాన్ సంయుక్త విన్యాసాలు.. ఆసక్తి రేపుతున్న బంధాలు


ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఈ నెల 19 నుంచి భారత్, జపాన్ నావికాదళ సంయుక్త విన్యాసాలు జరుగనున్నాయి. బంగాళాఖాతంలో జరిగే ఈ విన్యాసాల్లో భారత్, జపాన్ నావికాదళాలు పాలు పంచుకోనున్నాయి. 2011లో రక్షణ మంత్రి జపాన్ పర్యటన సందర్భంగా సంయుక్త విన్యాసాలు నిర్వహించాలని ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా జపాన్ తీరంలో 2012లో ఇరు దేశాలు సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి.

కాగా తాజాగా చైనా, జపాన్..చైనా, భారత్ మధ్య సరిహద్దు వివాదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. భారత్, జపాన్ ల వాదనను వినేందుకు కూడా చైనా సంసిద్దత వ్యక్తం చేయడంలేదని విశ్లేషకులు అంటున్నారు. అలాగే రెండు దేశాల సరిహద్దుల్లో సైనిక బలగాలను మోహరించడం, వైమానిక సరిహద్దుల పేరిట దేశంలోకి చొచ్చకురావడం వంటి తీవ్ర ఆరోపణలు చైనాపై ఉన్నాయి.

సరిహద్దు దేశాలతో సఖ్యత లేని కారణంగా పాకిస్థాన్, శ్రీలంక వంటి దేశాలకు సైనిక సహాయం పేరిట భారత విదేశీ విధానంపై ప్రభావం చూపే విధంగా ఉండడం.. చైనాకు ప్రధాన పోటీదారు భారత్ కావడం ఆసక్తి రేపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News