: గుంటూరు లోక్ సభ స్థానంపై గురి పెట్టిన మహేష్ బాబు బావ
రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు, సినీ నటుడు కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు లోక్ సభ స్థానంపై గురిపెట్టారు. ఆయన గుంటూరు పార్లమెంటరీ స్థానం నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి స్థానిక తెలుగుదేశం నేతలతో గల్లా జయదేవ్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కూడా గుంటూరు జిల్లా తెనాలి శాసనసభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని పావులు కదుపుతున్నట్టు సమాచారం.