: రేపట్నుంచి టీ.బిల్లుపై చర్చ.. బీఏసీలో నిర్ణయం
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో మరో అంకానికి తెరలేచింది. రేపటి (18వ తేది) నుంచి శుక్రవారం (20వ తేది) వరకు టీ.బిల్లుపై చర్చించాలని ఈ రోజు జరిగిన శాసనసభ బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయం కూడా లేకుండానే ఉదయం 9 గంటల నుంచి నేరుగా టీ.బిల్లుపైనే చర్చ జరపాలని నిర్ణయించారు. తర్వాత నాలుగు రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. బీఏసీ సమావేశాన్ని మరోసారి నిర్వహించాలని ఈ రోజు జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఆ భేటీలో సభ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటారు.