: ఏకపక్ష నిర్ణయాలు రాజ్యాంగాన్ని నాశనం చేస్తాయి: జేపీ
అసమగ్రమైన బిల్లును రాష్ట్రానికి పంపి... తన్నుకు చావండి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పంపిన బిల్లు ముసాయిదాలో ఏ అంశంపైన కూడా సమగ్రమైన సమాచారం లేదని విమర్శించారు. ఇరు ప్రాంతాల కోసం కేంద్రం వైపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు, వనరులు లభిస్తాయన్న విషయాన్ని పొందుపరచలేదని అన్నారు. ఎలాంటి వివరాలు లేకుండా గుడ్డిగా చర్చించమంటున్నారని.. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని జేపీ తెలిపారు. పూర్తి వివరాలను ఇచ్చిన తర్వాతే చర్చను చేపట్టాలని తాను స్పీకర్ ను కోరినట్టు చెప్పారు.