: ఇటలీ నిర్ణయం సరికాదు: ప్రధాని
భారత జాలర్లను చంపిన కేసులో ఇద్దరు ఇటలీ నావికాదళ జవాన్లను భారత్ కు పంపకూడదని ఆ దేశం తీసుకున్న నిర్ణయం ఆమోదనీయం కాదని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఈ విషయంలో సంబంధిత మంత్రితో మాట్లాడతానని కేరళ ఎంపీలకు ప్రధాని హామీ ఇచ్చారు.
ఇదే అంశంపై రాజ్యసభలో సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కడిగేశారు. ప్రభుత్వమే ఇటలీ నావికాదళ జవాన్లు పారిపోవడానికి సహకరించిందని, ఇది కేంద్ర ప్రభుత్వ కుట్ర అని తరుణ్ విజయ్ ఆరోపించారు. ఇక ఈ అంశంలో కేంద్రం ఎందుకు మెత్తగా ఉంటుందని బీజేపీ నేత బల్బీర్ పుంజ్ ప్రశ్నించారు.
గతేడాది కేరళ తీరంలో ఇద్దరు భారత జాలర్లపై ఇటలీ నావికాదళ జవాన్లు కాల్పులు జరిపి హతమార్చారు. వీరిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఇటలీలో ఎన్నికలలో పాల్గొనడానికి వారిద్దరూ సుప్రీంకోర్టు అనుమతితో స్వదేశానికి వెళ్లారు. మళ్లీ తిరిగి వచ్చి కోర్టులో హాజరు కావాల్సి ఉంది. కానీ, వారిని పంపడానికి ఇటలీ నిరాకరించడంతో విదాదం తలెత్తింది.