: కర్నూలులోని ఓ కాలనీకి శ్రీపాద పినాకపాణి పేరు
సుప్రసిద్ధ సంగీత విధ్వాంసులు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీపాద పినాకపాణి పేరును కర్నూలు నగరంలోని ఓ కాలనీకి పెట్టనున్నట్లు మంత్రి టీజీ వెంకటేశ్ తెలిపారు. ఆయన గుర్తుగా ఇక్కడ స్థూపం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లాలో రెవిన్యూ సదస్సు ప్రారంభం సందర్భంగా టీజీ ఈ విషయాన్ని వెల్లడించారు. కొంతకాలం నుంచి అనార్యోగ్యంతో బాధపడుతున్న పినాకపాణి సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.