: ఈ డ్రస్‌ ఏజ్‌ని దూరం చేస్తుందట!


కాలం గడిచేకొద్దీ వయసు మీద పడుతుంటుంది. పెరిగే వయసు ప్రభావం మన చర్మంపై చక్కగా కనిపిస్తుంటుంది. దీంతో ఏజ్‌ని దాచుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. చర్మంపై వచ్చిన ముడతలను తగ్గించుకోవడానికి రకరకాల క్రీములు రాయడం, ఇంకా బోలెడన్ని ఆపరేషన్లు చేసుకోవడం వంటివి చేస్తుంటారు. అలాకాకుండా తాము తయారుచేసిన ఒక కొత్తరకం డ్రస్‌ మన ఏజ్‌ని ఆమడ దూరంలో ఆపుతుందని దాని తయారీదారులు చెబుతున్నారు.

ఇంగ్లాండుకు చెందిన ఒక సంస్థ ఒక కొత్త తరహా వస్త్రాన్ని తయారుచేసింది. ఈ వస్త్రంతో తయారుచేసిన డ్రస్‌ ఏజ్‌ని అదుపులో ఉంచుతుందని ఆ సంస్థ చెబుతోంది. ఈ సంస్థ 24 కేరట్ల బంగారంతో యాంటీ ఏజింగ్‌ లెగ్గిన్స్‌ని తయారుచేసింది. ఈ లెగ్గిన్స్‌ తయారీలో ఉపయోగించిన బంగారం శరీరంలోని హయాల్యురానిక్‌ యాసిడ్‌ ఉత్పత్తిని పెంపొందించి చర్మాన్ని తడారనివ్వకుండా చూస్తుందని కంపెనీవారు చెబుతున్నారు. తద్వారా చర్మం ముడతలు తగ్గి మళ్లీ యవ్వనంగా తయారవుతుందట. దీని ఖరీదు సుమారు 12 వేల రూపాయల వరకూ ఉండవచ్చు. ఈ ఏజ్‌లెస్‌ లెగ్గిన్స్‌ మన దేశానికి రావడానికి ఇంకా సమయం పడుతుంది.

  • Loading...

More Telugu News