: రాజు తలచుకుంటే నౌకలకు కొదవా
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అని సామెత... అంటే రాజు వెయ్యాలనుకుంటే ఏదో ఒక రూపంలో దెబ్బలు వేసేయగలడు. అలాగే రాజు తలచుకుంటే ఎలాంటి నౌకనైనా కొనేయగలడు. కాబట్టే కోట్ల రూపాయల విలువచేసే విలాసవంతమైన నౌకను సదరు రాజుగారు కొనుక్కున్నారు.
యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్`నహ్యన్ అత్యంత ఖరీదైన ఒక విలాసవంతమైన నౌకను కొనుగోలుచేశారు. ఈ నౌక ఎంత ఖరీదైనది అంటే దీని ధర సుమారు 87 కోట్లు. దీని ఖరీదు షేక్ ఖలీఫా మొత్తం ఆస్థిలో కేవలం 3.5 శాతంగా ఉంటుందని వెల్త్`ఎక్స్ నివేదికలో పేర్కొంది. అయినా యూఏఈ అంటేనే డబ్బున్న, ఆయిల్ ఉన్న దేశంగా చెప్పవచ్చు. ఇక అలాంటి దేశానికి చెందిన అధ్యక్షుడు ఏం కొన్నా దాని ధర గురించి మనలాంటి వాళ్లు ఇలా నోరెళ్లబెట్టాల్సిందే!