: సవాలు విసిరితే కేసీఆర్ తోకముడిచాడు: చంద్రబాబు నాయుడు


మీడియా ముందు హైదరాబాద్ అభివృద్ధి, రాష్ట్ర వృద్ధి మీద మాట్లాడుతూ కేసీఆర్ సవాలు చేశాడని, అయితే తాను చర్చకు సిద్ధమని ప్రతిసవాలు విసిరితే తోక ముడిచాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తిగా తనకు గుండె మండుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ట్రానికి ఏదైనా చేసి ఉంటే జరుగుతున్న అంశాలపై విచక్షణ ఉండేదని ఆయన అన్నారు.

తాను రాష్ట్రాన్ని పాలించానని, తెలుగు జాతి ఐక్యత కోసం కృషి చేశానని ఆయన అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో లేవని, అలాగే తెలంగాణలో వైఎస్సార్ సీపీ లేదని అన్నారు. కేవలం రెండు ప్రాంతాల్లో బలంగా ఉన్న పార్టీ టీడీపీ అన్న కంటగింపుతో అందరూ కలిసి టీడీపీని ఇబ్బంది పెడుతున్నారని ఆయన పునరుద్ఘాటించారు. తమపై విమర్శలు మాని.. ప్రజలకు జరుగుతున్న నష్టం గురించి రాజకీయ పార్టీలు ఆలోచిస్తే బాగుంటుందని బాబు అన్నారు.

  • Loading...

More Telugu News