: రాజస్థాన్ రాష్ట్రంలోని చురు ఎన్నికలో బీజేపీ విజయదుందుభి
రాజస్థాన్ రాష్ట్రంలోని చురు విధానసభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయ దుందుభి మోగించింది. డిసెంబరు 13న జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఆర్.ఎన్.రాథోడ్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి హాజీ మక్భూల్ పై 24 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. డిసెంబరు ఒకటో తేదీన జరగాల్సిన చురు ఎన్నిక బీఎస్పీ అభ్యర్థి మృతితో డిసెంబరు 13న జరిగింది.