: నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు సిద్ధమంటున్న లాలూప్రసాద్


మతతత్వ పార్టీలు అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు సిద్ధమని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అందుకోసం అవసరమైతే దేశంలోని లౌకికవాద పార్టీలను ఏకం చేసేందుకు దేశమంతటా పర్యటిస్తానని ఆయన ప్రకటించారు. అంతేకాని, మతతత్వ పార్టీలను అధికారంలోకి రానివ్వబోమన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

జన్ లోక్ పాల్ బిల్లు రాకుండా అన్నాహజారే లాంటి వారు అడ్డుపడుతున్నారని లాలూ అన్నారు. అవినీతిపై పోరాడుతామంటూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకే పరిమితమైపోయిందని.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముందుకు రావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. బిర్సాముండా జైలు నుంచి ఇవాళ మధ్యాహ్నం బెయిల్ పై లాలూ విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి బెయిల్ పై బయటికొచ్చారు. భారత న్యాయవ్యవస్థ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News