: నవంబర్ నెలలో 7.52 శాతం నమోదైన ద్రవ్యోల్బణం
నవంబర్ నెలలో ద్రవ్యోల్బణం 7.52 శాతం నమోదు అయింది. అంతకు ముందు అక్టోబరు నెలలో 7 శాతం ద్రవ్యోల్బణం ఉంది. కూరగాయల ధరల పెరుగుదలతో భారత్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. దేశంలో ప్రధానంగా ఆలుగడ్డ, ఉల్లిగడ్డ (బంగళాదుంపలు, ఉల్లిపాయలు) ధరల పెరుగుదల ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. దీంతో నవంబర్ నెలలో దేశ ద్రవ్యోల్బణ సూచీ 14 నెలల గరిష్ట స్థాయికి చేరింది. పాలు, గోధుమలు తదితర నిత్యావసర వస్తువుల ధరలు 19 శాతం మేర పెరిగాయని టోకు ధరల సూచీ పేర్కొంది.