: గజరాజుకు బెయిల్
చట్టం ఎవరికైనా చట్టమే అంటుంటారు కదా. దీన్ని ఆచరణలో చూపారు కేరళలోని పోలీసులు. ముగ్గురిని హత్య చేసిన ఏనుగుపై కేసు పెట్టి పెరంబవూర్ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు గజరాజుకు బెయిల్ మంజూరు చేయడం తాజా విశేషం.
పెరంబవూరులో జనవరి 27న జరిగిన ఉత్సవంలో రామచంద్రన్ అనే ఏనుగు జనంపై ప్రతాపం చూపించింది. కొందరిని తొక్కేసింది. ఏనుగు దాడిలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రామన్ పై, దీని సంరక్షణ బాధ్యతలు చూస్తున్న తెచ్చికొట్టుకవు పెరమంగళత్తు దేవస్థానం అధికారులపై అటవీ శాఖాధికారులు కేసు నమోదు చేశారు.
ఏనుగును అదుపులోకి తీసుకుని గొలుసులతో కట్టిపడేశారు. ఈ కేసును పెరంబవూర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ర్టేట్ కోర్టు విచారిస్తోంది. రామచంద్రన్ బెయిల్ కోసం 30 లక్షల రూపాయలతోపాటు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును దేవస్థానం కోర్టుకు సమర్పించింది. దీంతో రామన్ కు బెయిల్ మంజూరైంది.

45ఏళ్ల రామచంద్రన్ దేశంలోనే పొడవైన ఏనుగుగా చెబుతారు. దీని ఎత్తు 3.17 మీటర్లు. దీన్ని ముద్దుగా రామన్ అని పిలుస్తుంటారు. ఈ ఏనుగుతో పెద్ద తలనొప్పేనంటూ వైద్యులు కోర్టుకు ప్రత్యేకంగా నివేదిక ఇచ్చారు. దీంతో వచ్చే మూడు నెలల పాటు ఏ ఉత్సవంలోనూ పాల్గొనరాదని కోర్టు రామన్ పై ఆంక్షలు విధించింది.